“జవాన్” మూవీ రివ్యూ

“జవాన్” మూవీ రివ్యూ

“జవాన్” మూవీ రివ్యూ

Image result for jawaan movie

నటీనటులు:

సాయిధరమ్ తేజ్

మెహ్రీన్

ప్రసన్న

కోట శ్రీనివాసరావు

జయప్రకాష్

సుబ్బరాజు

ఈశ్వరీరావు

నాగబాబు

సత్యం రాజేష్

అనీష్ కురువిల్లా తదితరులు

సంగీతం: తమన్

ఛాయాగ్రహణం: కె.వి.గుహన్

నిర్మాత: కృష్ణ

రచన-దర్శకత్వం: బి.వి.ఎస్.రవి

వాంటెడ్ సినిమాతో పరిచయమైన BVS రవికి ఇది రెండవ సినిమా. 2012 కాంట్రవర్సల్ సినిమా దేనికైనా రెడీకి కథని అందించారు.

ట్రైలర్కథ

జై (సాయి ధర్మ తేజ్) ఒక దేశ భక్తి కలిగిన యువకుడు. తన కుటుంబం కంటే దేశానికే ప్రాముఖ్యత ఇస్తాడు.

దేశానికి సేవ చేయడం కోసం DRDO లో ఉద్యోగం సాధించాలనుకుంటాడు.

కేశవ మరియు జై చిన్ననాటి స్నేహితులు, కేశవ మాత్రం డబ్బే అన్నిటికంటే ముఖ్యం అనుకుంటాడు.

అతను టెర్రరిస్టులతో చేతులు కలిపి డీఆర్డీవో దేశం కోసం కొత్తగా తయారు చేసిన ప్రమాదకర ఆయుధాన్ని దొంగిలించడానికి పన్నాగం పన్నుతాడు.

ఆ ప్రయత్నానికి జై అడ్డు పడతాడు. ఇక అక్కడి నుంచి ఇద్దరి మధ్య పోరు మొదలవుతుంది. ఈ పోరులో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.

కథనం

హీరో-విలన్.. పాత్రల పరిచయం తర్వాత ఇద్దరూ ఎవరికి వారుగా రంగంలోకి దిగి తమ లక్ష్యం కోసం సాగే క్రమంలో వచ్చే సన్నివేశాల్ని ఆసక్తికరంగానే నడిపాడు దర్శకుడు.

ఆ పోలికలు.. ఈ డీవియేషన్ల సంగతి వదిలేసి.. మిగతా విషయాల్లోకి వస్తే.. 135 నిమిషాల నిడివిలో ‘జవాన్’ చాలా వరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది.

తన కుటుంబం నాశనమైపోయినా పర్వాలేదు.. దేశం బాగుండాలని కోరుకునే కుర్రాడిగా హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం ‘జవాన్’కు ప్రధాన ఆకర్షణ.

ఆ పాత్రకు సాయిధరమ్ తేజ్ చాలా బాగా సూటయ్యాడు కూడా. విలన్ పాత్ర కూడా మొదట్లో బాగానే అనిపిస్తుంది.

ఈ రెండు పాత్రల పరంగా వైరుధ్యం.. ఇద్దరి మధ్య సంఘర్షణకు దారి తీసే పాయింట్ కూడా ఆసక్తి రేకెత్తిస్తాయి.

విలన్ మిషన్ని హీరో దెబ్బ తీసే సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొంచెం రొటీన్ గా అనిపించినప్పటికీ ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది.

ప్రధమ అర్ధం మంచిగా అనిపించినప్పటికీ ద్వితియార్థం మాత్రం ప్రేక్షకులని అంతలా ఆకట్టుకోలేకపోవడం విశేషం.

ఒక దశ దాటాక విలన్ పాత్రను తేల్చేశారు. విలన్ హీరో పక్కనే ఉండటం అన్నది కొత్త పాయింటే అయినా..ఇద్దరి మధ్య ఎత్తులు పైఎత్తుల్లో అంత కొత్తదనం.. ఉత్కంఠ లేకపోయింది.

ఇక్కడ సినిమా సాగతీతగా అనిపిస్తుంది. అందులోనూ ప్రి క్లైమాక్స్ దగ్గర్నుంచి హడావుడిగా ఏదో అలా లాగించేసిన ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటులు:

హీరో సాయి ధర్మ తేజ్ చాలా కొత్తగా కనిపించాడు. మెహ్రీన్ కేవలం పాటల కోసమే అని అనిపించింది.తండ్రి పాత్రలో జయ ప్రకాష్ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.

విలన్ పాత్రలో ప్రసన్నా ఒకే అనిపించాడు. కోటా శ్రీనివాసరావు,సుబ్బరాజు మరియు నాగబాబు వారి పాత్రలకు తగ్గట్టు నటించారు.సాంకేతికవర్గం:

థమన్ సంగీతం సినిమాకు చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. అన్ని పాటలు చాల బాగా అందించాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా చక్కగా అందించాడు థమన్.

నిర్మాణ విలువలు బాగున్నయి. డైరెక్టర్ మాత్రం పర్వాలేదు అనిపించుకున్నాడు.

చివరగా …. జవాన్ జస్ట్ రొమాంటిక్ త్రిల్లర్.

 

Nani4201

No Any widget selected for sidebar

Create AccountLog In Your Account