“ఒక్క క్షణం” రివ్యూ

No Any widget selected for sidebar

“ఒక్క క్షణం” రివ్యూ

” ఒక్క క్షణం ” మూవీ రివ్యూ

Image result for okka kshanam movie

 

నటీ నటులు :

అల్లూ శిరీష్

సురభి

అవసరాల శ్రీనివాస్

సీరత్ కపూర్

దాసరి అరుణ్ కుమార్

జయ ప్రకాష్

సత్యా

ప్రవీణ్, తదితరులు.

సంగీతం : మణి శర్మ

చాయా గ్రహణం : శ్యామ్ కె.నాయుడు

మాటలు : అబ్బూరి రవి

నిర్మాతలు : చక్రి చిగురుపాటి

దర్శకత్వం : వి.ఐ. ఆనంద్

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తర్వాత అదే తరహాలో దర్శకుడు తెరకెక్కించిన సినిమా ఇది. ఆసక్తి గల టీజర్ మరియు ట్రైలర్ తో ఆకట్టుకుంది.

కథ :

జీవా (అల్లు శిరీష్) మరియు జ్యో (సురభి) ఒకరిని ఒకరు ఇష్టపడతారు. మరో వైపు శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్) మరియు స్వాతి (సీరత్ కపూర్) ప్రేమలో ఉంటారు. వారి జీవితంలో జరిగే విషయాలు పారలల్ గా వీరి జీవితంలో జరగడంతో జీవా మరియు జ్యో ఆశ్చర్యానికి గురి అవుతారు. వీళ్ల పరిచయాలు మరియు ప్రేమ విషయాలు ఒకే విధముగా జరుగుతూ ఉంటాయి.

అనుకోకుండా స్వాతి హత్యకు గురి అవ్వడం, అదే విధంగా జ్యో కి కూడా జరుగుతుందా ? జీవా తనని ఎలా కాపాడుకుంటాడు అనేది మిగిలిన కథ యొక్క సారాంశము.

విశ్లేషణ :

కథ చాలా కొత్తగా ఉండడం మరియు దర్శకుడు తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. కానీ ప్రధమార్ధం మొత్తం చాలా బోర్ గా మరియూ చిన్నగా కథ మొదలవుతుంది. ఇంటర్వెల్ నుండి ద్వితియార్థం మొత్తం చాలా ఆసక్తికరంగా సాగడం విశేషం. క్లైమాక్స్ కూడా చాలా కొత్తగా చుపించాడు దర్శకుడు. ప్రధమార్ధం మీద కొంచం శ్రద్ధ వహించి ఉంటే చాలా బాగుండేది.

నటీ నటులు :

అల్లూ శిరీష్ మరియూ సురభి తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ని పెద్దగా ఉపయోగించుకోలేదు అని చెప్పుకోవచ్చు.

సాంకేతిక వర్గం :

మణిశర్మ పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. నేపధ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. మిగిలిన సాంకేతికవర్గ నిపుణులు పర్వాలేదు అనిపించారు.

చివరగా:

ఒక్క క్షణం.. బోరింగ్ మరియు థ్రిల్లింగ్!

రేటింగ్- 2.5/5

Disclaimer:

This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre.

 

Nani4201

No Any widget selected for sidebar

Create AccountLog In Your Account